CM Jagan: మరోసారి మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..మిగిలిపోయిన లబ్ధిదారులకు నిధుల జమ..!
CM Jagan: ఏపీ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు నిధులను జమ చేసింది.
CM Jagan: రాష్ట్రంలో వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు దూరమైన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు జమ చేశారు. 12 పథకాల్లో కొత్తగా 3 లక్షల 39 వేల 096 మంది లబ్ధిదారులకు ఒకేసారి రూ.137 కోట్ల నిధులు విడుదల చేశారు. దీంతో మరో 3.39 లక్షల మందికి లబ్ధి చేకూరింది.
ప్రజలకు చేరువ కావడమే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాజాగా 7 వేల 051 బియ్యం కార్డులు, 3 వేల 035 ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగా 2 లక్షల 99 వేల 085 మందికి పెన్షన్ కానుక అందించారు. ప్రతి ఏటా పెన్షన్ పెంచుతూ పోతున్నామని ఈసందర్భంగా సీఎం జగన్ అన్నారు. మరోవైపు ఈనెల 22న వైఎస్ఆర్ కాపు నేస్తం, 26న జగనన్న తోడు పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు.
ఏపీలోని విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. జగనన్న విదేశీ కానుక కింద రియింబర్స్‌మెంట్ ఇవ్వనుంది. ఇప్పటికే ఈపథకానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అమ్మ ఒడి పథకం కింద 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దిశగా ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి.
Also read:Botsa on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో రగడ..పువ్వాడకు ఏపీ మంత్రి బొత్స పంచ్..!
Also read:TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook