బెస్ట్ సీఎం టాప్-5లో సీఎం జగన్...
చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. కాగా ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో
అమరావతి: చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. కాగా ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ (C-Voter) నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా.. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్ సర్వే నివేదికలో తెలిపింది. సంక్షేమ పథకాల అమలులో, పరిపాలన స్థిరత్వం సాధించిందని వెల్లడించింది. దేశంలో ప్రజాదరణ లభించిన ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ ముఖ్యమంత్రులు భూపేశ్ వాఘేలా, పినరయి విజయన్ ఉన్నారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు.
Also Read: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
రెండోసారి ప్రధాని మోదీ (Narendra Modi) నేతృత్వంలో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చారు. తొలి ఐదేళ్ల పాలనాకాలంలో తనదైన ముద్రవేసుకున్న ప్రధాని వందేళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించారు. ఈ క్రమంలోనే రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. ఆరేళ్ల కాలంలో అనేక సంస్కరణలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..