ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

అబ్బాయి జూ. ఎన్టీఆర్ సహా పలు విషయాలపై నటసింహం నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రావాలనుకుంటే ఆపేదెవరంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Last Updated : Jun 2, 2020, 04:54 PM IST
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

Balakrishna Comments on Jr NTR | టాలీవుడ్‌లో ప్రస్తుతం కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఇటీవల తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ జయంతి నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలవగా.. తనలాంటి వ్యక్తికి సమావేశం గురించి ఒక్కమాట చెప్పలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ (Jr NTR political Entry)పై చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ రావాలనుకుంటే ఆపేదెవరని, అయితే సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉందని మరికాస్త సమయం పడుతుందన్నారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి.. వెంటనే క్షమాపణ చెప్పాలి..

‘రాజకీయాల్లోకి రావాలంటే డెడిటకేషన్ ఉండాలి. ఎన్టీఆర్‌(NTR)కు నటుడిగా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాడి ఇష్టం. అంతేకానీ ప్రస్తుతం ఉన్న ప్రొఫెషన్ వదులుకుని రమ్మని చెప్పలేము కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, సినిమాలు చేస్తున్నాను. నాన్నగారు సీఎం కూడా అయ్యారు. సినిమాలు చేశారు. ఏదైనా సరే వాళ్ల నిర్ణయాలను బట్టి ఉంటుందని’ జూ ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రంపై తన మనసులోని మాటల్ని బాబాయి బాలకృష్ణ షేర్‌ చేసుకున్నారు.  గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

(Video Courtesy: YOYO TV Channel) 

తన వియ్యంకుడు, అల్లుళ్లు రాజకీయాల్లోనే ఉన్నారని అయితే కూతురు బ్రాహ్మణికి పాలిటిక్స్ పేరు చెబితే చిరాకు వస్తుందన్నారు. ఆమె ముందు పాలిటిక్స్ ఎప్పుడూ మాట్లాడకూడదని, అలా ఉంటుంది పరిస్థితి ఉందన్నారు. అయినా కూడా ఒకరిని బలవంతంగా పాలిటిక్స్‌లోకి తీసుకురాలేమని, ఎందుకంటే అంటే వ్యక్తిగత ఆసక్తి ఉండాలని అభిప్రాయపడ్డారు. నాన్నగారు నెంబర్ వన్ హీరోగా ఉన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు. నటన అంటే కేవలం అరవడం, డైలాగ్‌లు చెప్పడం కాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలంటూ ఇంటర్వ్యూలో బాలకృష్ణ షేర్‌ చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

 

Trending News