అమరావతి: పదేళ్లుగా ఏపీఎస్ ఆర్టీసీలో అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. ఎట్టకేలకు కారుణ్య నియామకాలకు యాజమాన్యం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని ఈయూ నేతలు తెలిపారు. ఇంతకాలంపాటు కారుణ్య నియామకాలు నిలిపేసిన కారణంగా 1,065 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఇకపై దశలవారీగా ఆ పోస్టుల నియామకం జరుగుతుందని భావిస్తున్నట్టు ఈయూ నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. పెండింగ్ పోస్టులలో 2012 డిసెంబరు 31కి ముందుగా ఉన్న 313 మందికి ఈనెలాఖరులోగా నియామకాలు పూర్తి చేసేందుకు ఎండీ సురేంద్రబాబు ఆదేశాలు జారీచేసినట్లు ఈయూ నేతలు వెల్లడించారు. ఈ నెలలో కారుణ్య నియామకాల్లో అవకాశం పొందే వారిలో 246 మంది కండక్టర్లు, 67 మంది శ్రామిక్‌గా దరఖాస్తు చేసుకున్నారని నేతలు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మిగతా పోస్టుల గురించి మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల్లో మిగిలినవారికి కూడా ఈ ఏడాది డిసెంబర్‌లోగా దశలవారీగా నియామకాలు చేపడతారని సంఘం నేతలు తెలిపారు.