Congress Leader Komatireddy Rajgopal Reddy in a Dilemma: ఆయనో సీనియర్ ఎమ్మెల్యే...అయితే ఇప్పుడు ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎవరి పక్షం తీసుకుంటారో... ఎప్పుడు ఎవర్ని సమర్థిస్తారో అర్థం కావడం లేదు.  పార్టీలో ఫైర్‌ బ్రాండ్ లీడరే.. కానీ, తన తీరుతో క్యాడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఆయనే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అటు కాషాయ కండువా కప్పుకోడు.. ఇటు కాంగ్రెస్ లో  ఇమడలేడు... ఇదీ పరిస్థితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా తట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయన ... క్యాడర్ లో ఆయనకు ఉన్న  క్రేజ్ అలాంటిది. స్థానిక పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ కోసం తనదైన శైలిలో పాటుపడే ఫైర్ బ్రాండ్ నేతగా రాజగోపాల్ రెడ్డికి మంచి పేరే ఉంది. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ప్రభుత్వ యంత్రంగం ద్వారా పరిష్కరించుకోవడంలో ఈయనకు ఈయనే సాటి. 


అయితే ఎప్పుడూ దూకుడుగా ఉండే రాజగోపాల్ రెడ్డి… ఈ మధ్య  కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో ఆయన త్వరలో  కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం  జోరుగా సాగుతోంది. అప్పుడప్పుడు బీజేపీని సమర్థిస్తున్నట్లు ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు కూడా వెళ్తున్నాయి. అయితే ఎంత కాలం గడుస్తున్నా ఆయన బీజేపీలో చేరడం పై ఎలాంటి పురోగతి లేకపోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోతోంది. 


రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ.. ఆయన మనసంతా బీజేపీ వైపే ఉందని ఆయన ఫాలోవర్స్‌ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతుండడంతో ఆయన ఎప్పటికైనా  బీజేపీలోకి వెళ్లడం ఖయామని అంటున్నారు. వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగినా.. తాను మాత్రం పార్టీ మారుతున్నానని తన దగ్గరి వాళ్లకు చెప్పడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అనుచరులు భావిస్తున్నారు. 


మరోవైపు తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ .. తెలంగాణలో మరోసారి ముందస్తు వెళ్తారనే చర్చ జరుగుతోంది. దీంతో తన పార్టీ మార్పుపై చర్చించేందుకు ఇటీవలే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో సమావేశం అయ్యారని సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడానికి ఒక రోజు ముందే ఈ భేటీ జరిగిందని సమాచారం. ఈ వరుస పరిణామాలు రాజగోపాల్ రెడ్డి  అనుచర వర్గాన్ని గందరగోళంలో పడేస్తోంది.


రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక మనుగోడులో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు, ఒక మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. అయితే, ఆయన తీరుతో ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఒకే ఒక్క జడ్పిటిసి మాత్రమే మిగిలారు. అభిమానం ఉన్నా.. ఆయన క్రియేట్‌ చేస్తున్న కన్ఫ్యూజన్‌ తో సతమతం అవుతోంది క్యాడర్. ఇప్పటికైనా రాజగోపాల్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన మద్ధతుదారులు కోరుతున్నారు.


Also Read: Hyderabad Bullet Train: విజయవాడ, హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ - విభజన చట్టంలోని హామీని నెరవేర్చాలని డిమాండ్!


Also Read: Suresh Raina: ఐపీఎల్​ 2022లోకి సురేశ్​ రైనా- ఈసారి డిఫరెంట్​ రోల్​లో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook