Suresh Raina: ఐపీఎల్​ 2022లోకి సురేశ్​ రైనా- ఈసారి డిఫరెంట్​ రోల్​లో..

Suresh Raina: సురేశ్ రైనా ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​. మెగా వేలంలో అన్​సోల్డ్​గా మిగిలిపోయిన కారణంగా ఈసారి ఐపీఎల్​కు దూరమవుతాడని అంతా భావిస్తున్నారు. అయితే ఈసారి కొత్త గెటప్​లో ఐపీఎల్​లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు రైనా.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 12:17 PM IST
  • ఐపీఎల్​లోకి రైనా రీ ఎంట్రీ
  • ఈసారి కొత్త అవతారంలో..
  • మెగా వేలంలో అన్​సోల్డ్​గా మిగిలిన సురేశ్​ రైనా
Suresh Raina: ఐపీఎల్​ 2022లోకి సురేశ్​ రైనా- ఈసారి డిఫరెంట్​ రోల్​లో..

Suresh Raina: క్రికెటర్​ సురేశ్​ రైనా మళ్లీ ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అదేమిటీ ఐపీఎల్ మెగా వేలం 2022లో చెన్నై సూపర్​ కింగ్స్​ సహా మిగతా 9 జట్లలో ఏ టీమ్ కూడా​ అతడిని కొనలేదు కాదా? మళ్లీ ఐపీఎల్​లోకి ఎలా వస్తున్నాడు అనుకుంటున్నారు కదా! అయితే ఈసారి ప్లేయర్​గా కాకుండా కొత్త అవతారంలో ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు సురేశ్ రైనా.

ఇక నుంచి రైనా కొత్త అవతారం..

ఐపీఎల్​ 2022లో ప్లేయర్​గా ఆడకపోయినా.. కామెంటేటర్​గా మారనున్నాడు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​ మ్యాచ్​లకు హిందీలో కామెంటేటర్​గా సురేశ్​ రైనా వ్యవహరించనున్నాడు. రవి శాస్త్రితో కలిసి హిందీలో కామెంట్రీ చెప్పనున్నాడు రైనా. ఇప్పటికే రైనాతో స్టార్​ స్పోర్ట్స్​ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తా సంస్థ దైనిక్​ జాగరన్ ఓ కథనం రాసుకొచ్చింది.

రవి శాస్త్రి కూడా 2017 తర్వాత మళ్లీ ఈ ఐపీఎల్​ సీజన్​తోనే కామేంటేటర్​గా మారనున్నాడు. మొన్నటి వరకు టీమ్​ ఇండియా హెడ్​ కోచ్​గా ఉన్న కారణంగా కామెంటేటర్​గా వ్యవహరించలేదు రవి శాస్త్రీ.

ఐపీఎల్​లో సురేశ్ రైనా ప్రస్థానం..

చాలా ఏళ్లుగా సురేశ్​ రైనా చెన్నై సూపర్​ కింగ్స్​ తరఫున ఆడాడు. జట్టు 4 సార్లు కప్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​లు ఆడాడు రైనా. ఇందులో 175 మ్యాచ్​లు కేవలం చెన్నై తరఫున ఆడటం విశేషం. ఐపీఎల్​లో రైనా 5528 పరుగులు చేశాడు. అందుకే రైనాను మిస్టర్​ ఐపీఎల్​గా పిలుస్తుంటారు.

అయితే ఈసారి ఐపీఎల్​ మెగా వేలం నిర్వహించగా అందులో తాను చాలా కాలం సేవలందించిన చెన్నై జట్టు సహా ఏ ఇతర టీమ్​ కూడా రైనాను కొనుగోలు చేయలేదు. దీనితో అతడు అన్​సోల్డ్​గా మిగిలిపోయాడు. దీనితో అతడు కామెంటేటర్​గా ఇప్పుడు ఐపీఎల్​లో తన ప్రస్థానాన్ని సాగించనున్నాడు రైనా.

Also read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!

Also read: IPL 2022 New Rules: డీఆర్ఎస్, సూపర్ ఓవర్‌లో కీలక మార్పు.. ఐపీఎల్ 2022 నయా రూల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News