AP News: ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో (Vijayanagaram district) కరోనా కలకలం రేపింది. జిల్లాలోని కొత్తవలస (Kothavalasa) జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి పరీక్షలు చేయగా.. ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రెండ్రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఇంతమందికి ఒకేసారి కరోనా పాజిటివ్ గా తేలడంతో..స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ తో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్‌ కేసులు (Corona Active Cases in AP) ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో డిసెంబర్ 12న తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు 17 ఒమిక్రాన్ కేసులు (AP omicron Cases) వెలుగుచూశాయి. 


Also Read: AP Corona cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు- వైజాగ్​లో అధికంగా యాక్టివ్​ కేసులు!


దేశంలో పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు (Corona cases in india) భారీగా నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. వైరస్ తో మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,71,830 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం 99,27,797 టీకా డోసులు (Vaccination in India) ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి