విషాదం: భార్యకు కరోనా పాజిటివ్.. భయంతో భర్త మృతి
కరోనా లక్షణాలు కనిపించిన ఓ మహిళకు పరీక్షంగా నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. కుటుంబాన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
ఏలూరు: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సమస్య కరోనా వైరస్ (CoronaVirus). నేరుగానే కాదు పరోక్షంగానూ కరోనా మహమ్మారి ప్రాణాలు బలి తీసుకుంటోంది. కరోనా సోకిన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తుంటే ఆందోళన చెందిన ఇంటి పెద్ద గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
ఏలూరు పట్టణం గన్ బజార్‌లో మధ్య వయసు ఉన్న మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో మహిళను కరోనా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబసభ్యులను సైతం క్వారంటైన్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం (జూన్ 9న) రాత్రి వారిని వాహనంలో ఎక్కిస్తుండగా కోవిడ్ బాధితురాలి భర్త ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆ వ్యక్తి చనిపోయారని వైద్యులు నిర్దారించారు. తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తితో పాటు కరోనా సోకిన మహిళ కుటుంబసభ్యులు అందరికీ కోవిడ్19 టెస్టులు నిర్వహించారు. చనిపోయిన వ్యక్తికి నెగటివ్ రాగా, వీరి కుమారుడికి కోవిడ్ పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకకపోయినా కరోనా వైరస్ భయం ఓ నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. ఇంటి పెద్ద చనిపోవడం, మహిళకు, ఆమె కుమారుడికి కరోనా సోకడంతో కుటుంబం ఒక్కసారిగా కష్టాల వలయంలో చిక్కుకున్నట్లయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్