New coronavirus strain: కొత్త కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిందా లేదా..యూకే నుంచి ఏపీ, తెలంగాణలకు చేరిన వారి పరిస్థితేంటి..పూణేకు పంపించిన రిపోర్టుల్లో ఏం తేలింది. ఎంతమందికి కరోనా వైరస్ నిర్ధారణైంది..కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


యూకే ( UK ) లో వెలుగు చూసిన కరోనా కొత్త వైరస్ ( New coronavirus ) మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. విమానాల్ని నిషేధించకముందే ఇండియాకు చేరుకున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ( RTPCR Tests ) నిర్వహించింది భారత ప్రభుత్వం. కొంతమందికైతే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. అయితే వీరిలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా అనే విషయం తేల్చేందుకు ఆ శాంపిల్స్‌ను పూణే ( Pune ), సీసీఎంబీ ( CCMB )లకు పంపించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.


యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh )కు ఇప్పటివరకూ 1214మంది వచ్చారు. ఇందులో 1158 మందిని ఇప్పటికే గుర్తించగా మరో 56 మందిని గుర్తించాల్సి ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించివారిలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ ఆరుగురిలో తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు..గుంటూరులో ఇద్దరు ఉన్నారు. ఈ అందర్నీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 1101 మందిని క్వారెంటైన్‌ ( Quarantine ) లో ఉంచారు. 


ఇక పాజిటివ్ వచ్చినవారి శాంపిల్స్‌ను పూణే వైరాలజీ ఇనిస్టిట్యూట్‌తో పాటు  హైదరాబాద్ సీసీఎంబీకు పంపించారు. ఇంకా ఈ నివేదికలు రావల్సి ఉంది. ఈ నివేదికలు వచ్చిన తరువాతే..వీరిలో కరోనా కొత్త వైరస్ ఉందా లేదా అనేది నిర్ధారణవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్త రకం కరోనా ఎవరికీ సోకలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  


Also read: AP: పోలవరం ప్రాజెక్టుపై తొలగిన సందిగ్దత, డీపీఆర్ 2 అధికారికంగా ప్రకటించిన కేంద్రం