అమరావతి: ఏపీలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 1,221 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  మొత్తం 8,59,932కి చేరింది. ప్రస్తుతం 15,382 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,37,630 మంది కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 6,920కు చేరుకుంది. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల విషయానికొస్తే.. అనంతపురం జిల్లాలో 41, చిత్తూరు జిల్లాలో 175, తూర్పుగోదావరి జిల్లాలో 202, గుంటూరు జిల్లాలో 144, కడప జిల్లాలో 65, కృష్ణా జిల్లాలో 198, కర్నూలు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 50, శ్రీకాకుళం జిల్లాలో 34, విశాఖపట్నం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 32, పశ్చిమ గోదావరి జిల్లాలో 145 పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) నమోదయ్యాయి.


Also read : Delhi to Mumbai flights, trains: ఢిల్లీ నుంచి రైళ్లు, విమానాలు బంద్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి