అమరావతి: లాక్ డౌన్ తర్వాత కూడా కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉన్న హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి అన్నారు. ఏపీ నుండి మర్కజ‌్‌కు వెళ్లి వచ్చిన వారు సుమారు వేయి మంది వరకు ఉన్నారని చెబుతూ.. ఏపీలో గుర్తించిన 304 పాజిటీవ్ కేసుల్లో 280 కేసులు మర్కజ్‌తో లింక్ ఉన్న వారేనని.. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు వాళ్ల సంబంధీకులకు కలిపి సుమారు 3,500 మంది శాంపిళ్లు సేకరించి కోవిడ్ పరీక్షలకు పంపించామని ఆయన తెలిపారు. ఇవేకాకుండా ఇంటింట నిర్వహించిన సర్వేలోనూ సుమారు మరో 5వేల మందిని గుర్తించాం. మెడికల్ ఆఫీసర్ల సూచనల మేరకు వీరిలో 1800-2000 మందికి కరోనావైరస్ టెస్టులు నిర్వహిస్తున్నాం. జిల్లాకు వంద చొప్పున సుమారుగా 1000 శాంపిళ్లు సేకరించామని ఆయన పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Super Pink Moon Photos: భారత్‌లో కెమెరాకు చిక్కిన సూపర్ పింక్ మూన్ ఫోటోలు


సుమారు 2 లక్షల టెస్టులు చేయాల్సి వస్తుండగా ప్రస్తుతం రోజుకు వేయి శాంపిళ్ల టెస్టులు చేపడుతున్నాం. సుమారు 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఆర్డర్ ఇచ్చాం.  ఏపీలో ప్రస్తుతం 240 ట్రూనాట్ మెషీన్లు ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే 3 వేల నుంచి 4 వేల శాంపిళ్లను టెస్ట్ చేసే సామర్ధ్యం వస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల చికిత్స కోసం, కరోనా అనుమానితుల ఐసోలేషన్ కోసం 20వేల బెడ్లు సిద్దం చేస్తున్నాం. 13 జిల్లాల్లోనూ కోవిడ్ రోగుల చికిత్స కోసం ఎక్కడికక్కడే ఆస్పత్రులను గుర్తించాం. రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా నాలుగు కోవిడ్ ఆస్పత్రులు సేవలు అందిస్తున్నాయని జవహార్ రెడ్డి తెలిపారు.


Also read : Coronavirus updates ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సమాచారం


జవహార్ రెడ్డి ఈ విషయమై మరింత మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం 12వేల పీపీఈ కిట్స్ (Personal protective equipment kits), 20 వేల ఎన్-95 మాస్కులు (N-95 masks) అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా మరో 40 లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్కులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ కరోనా వైరస్ తీవ్రత పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగినట్టయితే.. వారికి సకాలంలో చికిత్స అందించడానికి ముందు జాగ్రత్త చర్యగా జిల్లా ఆస్పత్రుల్లో 500, రాష్ట్ర స్థాయి ఆస్పత్రుల్లో 500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశ ప్రారంభంలో ఉందని.. అందువల్ల సమయానికి అనుకూలంగా దశలవారీగా లాక్ డౌన్ లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..