సూపర్ పింక్ మూన్.. అదేంటి మన భూగ్రహానికి ఉన్నది ఒక్కటే చంద్రుడు కదా.. మరి ఈ సూపర్ పింక్ మూన్ అంటే ఏంటి అని అనుకంటున్నారా ? అయితే ఏప్రిల్ 8న, బుధవారం రాత్రి మీరు ఇంట్లోంచి బయటికొచ్చి ఆకాశంలోకి చూస్తే కనిపించేదే.. ఆ సూపర్ పింక్ మూన్ అన్నమాట. మరి రోజూ కనిపించే చంద్రుడే కదా దీనిని సూపర్ పింక్ మూన్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే.. నేడు చంద్రుడు రోజుకంటే ఎక్కువగా ప్రకాశవంతంగా, ఎప్పటికన్నా భూమికి దగ్గరిగా అదే కక్ష్యలోకి వచ్చి, ఎప్పటికన్నా నిండుగా కనిపించడమే అందుకు కారణం. అంతేకానీ చంద్రుడే పింక్ కలర్‌లో ఉంటాడని కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును.. నేడు చంద్రుడు భూమికి 221,772 మైల్స్ (356,907 కిలోమీటర్స్) దూరంలోంచి కనిపించనున్నాడు. 2020లో మొత్తం నాలుగుసార్లు సూపర్ మూన్ కనిపించనుండగా.. ఈ ఏడాది మొత్తంలో చంద్రుడు ఇలా ఇంత పెద్దగా కనిపించడం మాత్రం ఈ ఒక్కసారే జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Visuals of Super Pink Moon, which is the biggest and brightest full moon of the year 2020, from Ludhiana in Punjab. pic.twitter.com/ojHAkFlnnv
— ANI (@ANI) April 7, 2020
భారత్‌లో సూపర్ పింక్ మూన్ విషయానికొస్తే.. ఏప్రిల్ 8న కోల్‌కతా హారిజాన్ నుండి సాయంత్రం 6.17 గంటలకు ఉదయించి.. మరునాడు ఉదయం 6.19 గంటలకు అస్తమయం అవుతుందని ఎంపి బిర్లా నక్షత్రశాల డైరెక్టర్ దేవీప్రసాద్ దౌరి తెలిపారు. భారత్‌లో సూపర్ పింక్ మూన్ ఏప్రిల్ 8న కనిపించనుందని దేవీప్రసాద్ స్పష్టంచేశారు.
Also read : కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఈ నేపథ్యంలోనే రేపటి సూపర్ పింక్ మూన్ ఇవాళ పంజాబ్‌లోని లుధియానా నుండి ఇలా కనిపిస్తున్నాడంటూ ఆ విజువల్స్‌ని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ ఇలా ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకుంది.