Heavy Rains: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు భారీ వర్షాలు
Heavy Rains: ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. రానున్న 2-3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడిందని,తుపానుగా మారనుందని ఐఎండీ సూచిస్తోంది.
Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఇప్పటికే వాయుగుండంగా మారింది. మరో రెండ్రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారి అక్కడ్నించి తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచన జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖపట్నానికి 420 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తరువాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా ఈ నెల 18వ తేదీనాటికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న వాయుగుండం తుపానుగా మారిన తరువాత బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనుందని అంచనా.
ఫలితంగా రానున్న రెండ్రోజులు ఏపీలోని రాయలసీమలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీయడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
Also read: Ys Jagan Mohan Reddy: ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook