Cyclone Asani Update Today: తీవ్ర తుపాన్ అసని పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దిశ మార్చుకున్న అసని  కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు వస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రానికి బందర్‌ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కాకినాడకు దక్షిణ-ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు నైరుతి దిశగా 530 కిలోమీటర్లు ... పూరికి 630 కిలోమీటర్లు నైరుతి దిశగా అసాని కేంద్రీకృతమై ఉంది. మే 11 నాటికి వాయవ్య దిశగా పయనించి.. కాకినాడ, విశాఖపట్నం తీరాల మధ్యకు చేరుకుంటుందని ఐఎండీ వెల్లడించింది.


మే 11 ఉదయానికి తీవ్ర తుపాను అసాని తుపాను బలహీనపడనుంది. మే 12 ఉదయానికి వాయుగుండంగా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


అసని ప్రభావంతో వర్షాలు


మే 10: కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. 10వ తేదీ అర్థారాత్రి నుంచి ఒడిశా తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.


మే 11:  కోస్తా ఆంధ్ర, ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి.


మే 12: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


[[{"fid":"230756","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cyclone-asani-live-updates-andhra-pradesh-rainfall-updates.jpg","field_file_image_title_text[und][0][value]":"అసని తుపాను లైవ్ అప్‌డేట్స్‌"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cyclone-asani-live-updates-andhra-pradesh-rainfall-updates.jpg","field_file_image_title_text[und][0][value]":"అసని తుపాను లైవ్ అప్‌డేట్స్‌"}},"link_text":false,"attributes":{"alt":"Cyclone-asani-live-updates-andhra-pradesh-rainfall-updates.jpg","title":"అసని తుపాను లైవ్ అప్‌డేట్స్‌","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈదురు గాలులు


అసని తుపాను ప్రభావంతో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఒక్కోసారి గంటకు 120 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది.


తెలంగాణపై ప్రభావం


అసని ప్రభావం తెలంగాణ జిల్లాలపైనా పడనుంది. తుపాను ప్రభావంతో పాటు ఉపరితల ద్రోణ కారణంగా మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.


Also Read: Yashwant Sinha Comments: అన్ని మతాల్ని నిషేధించి..హిందూ దేశంగా ప్రకటించేయండి


Also Read:Teenmar Mallanna Arrest: జనగాంలో తీన్మార్ మల్లన్న అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook