Yashwant Sinha Comments: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారంగా ఇండియాలో అన్ని మతాల్ని నిషేధించమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందూయేతర చరిత్రను దేశం నుంచి తొలగించి..గతంలో హిందూవులకు వ్యతిరేకంగా బౌద్ధులు, జైనులు, ముస్లింలు, క్రిస్టియన్లు చేసిందానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీఎంసీ వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించి..దేశంలోని అన్ని మతాల్ని నిషేధిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలకు ఇదే మంచి పరిష్కారమన్నారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరణ చేయాలని కూడా ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతల్ని బీజేపీ పెంచి పోషిస్తోందనేది టీఎంసీ ఆరోపణ. అందుకే యశ్వంత్ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లౌడ్ స్పీకర్లలో అజాన్ నిషేధించాలనే వివాదం మహారాష్ట్రలో నడుస్తోంది. మరోవైపు ఢిల్లీలో కేవలం ముస్లిం సామాజికవర్గాలున్న ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సీబీఎస్ఈ సిలబస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఛాప్టర్లను తొలగించడాన్ని కూడా యశ్వంత్ సిన్హా ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. మొఘల్ చరిత్రకు చెందిన కొన్ని పాఠ్యాంశాల్ని తొలగించడంపై బీజేపీపై ప్రతిపక్షాలు ఆరోపణలు సంధించాయి.
Also read: UPSC CSE Admit Card 2022: విడుదలైన UPSC సివిల్ సర్వీసెస్ అడ్మిట్ కార్డ్..ఈ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook