Cyclone Jawad Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో జవాద్ తుపాన్(Cyclone Jawad)కొనసాగుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు దక్షిణంగా 260 కి.మీ, పూరీకి నైరుతి దిశలో 330 కి.మీ దూరంలో జవాద్‌ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకున్న తుపాను.. ప్రస్తుతం మందగమనంతో ఒడిశా వైపు కదులుతోందని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: CycloneJawad : ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉన్న జవాద్.. ఇవాళ రాత్రికల్లా బలహీనపడనున్న తుపాన్


గడచిన 6గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. రేపు మధ్యాహ్నానికి ఒడిశా(Odisha)లోని పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. అనంతరం మరింత బలహీనపడి పశ్చిమ్‌ బెంగాల్‌(West Bengal) వైపుగా కదిలే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు(Rains) కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి