Cyclone Michaung Alert: ఏపీకు సూపర్ సైక్లోన్ ముప్పు, డిసెంబర్ 1 నుంచి భారీ వర్షాలు
Cyclone Michaung Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా, ఆ పై తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Michaung Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 29 వతేదీ నాటికి వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారేందుకు అనువైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే రానున్న 5 రోజులు ఏపీకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనం థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతంపై ఆవహించి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ నికోబార్ సముద్రం, ధాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతం మీదుగా కదులుతోంది. ఈ నెల 29వ తేదీకు వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆ తరువాత తుపానుగా మారి అండమాన్ నికోబార్ ద్వీపానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 4,5 తేదీల్లో ఏపీ తీరానికి సమీపించనుంది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన మిచౌంగ్ అనే పేరు పెట్టారు. ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న నాలుగవ తుపాను కానుంది. ఇప్పటికే హిందూ మహాసమద్రంలో ఆరు తుపాన్లు ఏర్పడ్డాయి. తుపాను ఏపీ తీరానికి చేరే సమయానికి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశాలు కూడా లేకపోలేదని ఐఎండీ తెలిపింది.
ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో అండమాన్ నికోబార్ ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది. మరో 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగనుందని, ఆ ప్రాంతంలో ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే గత రెండు వారాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, కర్నూలు, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం మోస్తరు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో హైదరాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం పడింది.
డిసెంబర్ 1 నాటికి తుపానుగా ఆవిర్భవించాక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో వర్షాలు పడటం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం కలగనుంది. ఎందుకంటే పంట చేతికందే సమయం కావడంతో ఇప్పటికే కురిసిన వర్షాలతో పంట దెబ్బతింది. ఇప్పుడిక తుపాను ప్రభావం తోడైతే అన్నదాతలకు మరింత నష్టం కలగవచ్చు.
Also read: Telangana Elections 2023: తెలంగాణలో చివరి 48 గంటల్లో ఏం జరగనుంది, ఫలితాలే మారిపోయే పరిస్థితి ఉందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook