AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా వడగాలులతో సతమతమవుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలు ప్రవేశంతో పలు చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
AP Rains:పశ్చిమ మధ్య బంగాళ ఖాతంతో పాటు దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఈ రోజు ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Telangana Rains: నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక నైరుతి ప్రభావంతో హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Alert: నైరుతి ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.ఈ రోజు మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు,నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం, రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Heavy Rain Alert: తెలంగాణలో మృగశిర కార్తె ప్రవేశించిన నేపథ్యంలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు అదే సమయంలో ఎల్నినో ప్రభావంతో చాలా చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నైరుతి ఋతుపవనాలు ఇక్కడ మందగమనంతో కదులుతున్నాయి. మరో 2 రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rains Elnino Effect: తెలంగాణలో నైరుతి ఋతుపవనాల ప్రవేశించిన ఆశించిన మేర ఎండల తీవ్రత తగ్గలేదు. పలు చోట్ల వడగాలుల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృగశిర కార్తె ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పడ్డట్టు కనపడినా.. నిన్న చాలా చోట్ల ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. మొత్తంగా తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ఆశించిన మేర విస్తరించలేదు. దీనికి అంతటికి కారణం కారణం ఎల్నినో అని చెబుతున్నారు.
Andhra Pradesh Rain alert: నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో మందకొడిగా సాగుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేటి నుంచి ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
AP Rains: నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలో అమరావతితో పాటు విజయవాడు పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Big Rain Alert To Telangana: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఎండలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు నేటి నుంచి 3 రోజుల పాటు భీకర వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Big Rain Alert: నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలకు తెలంగాణ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాల ప్రవేశంతో తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Monsoons in Telangana: జూన్ నెల ప్రవేశించినా ఇంకా సూర్యుడు మాడు పగలగొడుతూనే ఉన్నాడు. కానీ ఎడారిలో ఒయాసిస్సులా ప్రస్తుతం తెలంగాణలో మెల్లగా వాతావరణం మారుతుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు.. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి.
Rain Alert: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీని ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు, ఏపీతోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మరికొద్దిరోజుల్లో రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే మూడు నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Orange Alert to Telangana: తెలంగాణలో ఈ రోజు రేపు పలు జిల్లాల్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో మలమల మాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
AP Weather Alert: ఆంధ్ర ప్రదేశ్లో ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రతల కారణంగా ఏర్పడిన క్యూములో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు పడుతున్నాయి. తాజాగా రెండు మూడు రోజులుగా చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలంగాణలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Monsoon Effects on Telugu States: ఈ సారి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలను ఎండలు మంటెక్కించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్య మధ్యలో ఎడారిలో ఒయాస్సిలా క్యూములో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సకాలంలో రావాల్సిన ఋతుపవనాలు ఈ సారి ఎల్నినో ప్రభావంతో మరింత ఆలస్యం కానున్నాయి.
AP Rain Alert: రోహిణి కార్తె ప్రవేశించిన తర్వాత ఎండలు మరింత మంట పుట్టిస్తున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురువడంతో ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓ రకంగా ఆంధ్ర ప్రదేశ్లో చిత్ర విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి.
Telangana IMD: గత రెండు మూడు నెలలుగా ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అవును తెలంగాణలో ఋతు పవనాల ఆగమనానికి లైన్ క్లియర్ అయింది. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకాల్సిన ఋతు పవనాలు ఈ నెల 31న తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP IMD Alert: ఆంధ్ర ప ్రదేలోని నాలుగు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.
Telangana Farmers Crop Loss: తెలంగాణలో గత కొన్ని రోజులుగా దంచి కొడుతున్న ఎండలకు కాస్త బ్రేక్ ఇచ్చాయి వర్షాలు. దీంతో ఎండలతో సతమతమైన ప్రజలకు కాస్త తెరపి పడ్డా.. ఈ అకాల వర్షాలు రైతులను నట్టేటా ముంచాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో తడిసిముద్దయింది. దీంతో తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారు.
Telangana Rains: తీవ్రమైన ఎండలతో అల్లాడిన తెలంగాణ ప్రజలపై వరుణుడు చల్లని చూపు చూసాడు. నిన్న రాత్రి కురిసిన వర్షంతో తెలంగాణలో వాతావరణం మారింది. ఎండలతో అల్లాడిన ప్రజలు చినుకులు పడుతుండడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. పలు జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో తెలంగాణ ఎండల నుంచి కాస్త తెరిపి పడింది.
Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడి అగ్నిప్రవేశంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరగనుంది. అదే విధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది.
Heat Waves: తెలంగాణలో చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. పగలు మాడు పగిలే ఎండలతో అల్లాడిన ప్రజలకు .. రాత్రి వేళ వర్షాలతో కాస్త తెరపి పడ్డట్టు అయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నింటిని తిరగరాస్తుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలతో ఉదయం కాస్త చల్లబడింది.