Michaung Cyclone Effect: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు, ఏ జిల్లాలో ఎంత వర్షపాతం
Michaung Cyclone Effect: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గత రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏయే జిల్లాల్లో ఎంత వర్షం కురిసిందో తెలుసుకుందాం.
Michaung Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాల్చి నిన్న మంగళవారం మద్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటింది. తుపాను నేపధ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు నమోదయ్యాయి. తీరం దాటిన తరువాత తుపాను క్రమంగా బలహీనపడుతూ వాయగుండంగా..అల్పపీడనంగా మారనుంది.
మిచౌంగ్ తుపాను కారణంగా ఇప్పటికే మూడ్రోజుల్నించి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవతున్నాయి. అత్యధికంగా కోస్తాంధ్ర జీల్లాలపై ప్రభావం కన్పించింది. రాయలసీమ ప్రాంతంలో తిరుపతిలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. తిరుపతిలో మంగళవారం సాయంత్రం వరకూ అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తరువాత కోనసీమ జిల్లాల్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాపట్లలో 6.4 సెంటీమీటర్ల వర్షం పడింది.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షపాతం వివరాలు
తిరుపతిలో 9.3 సెంటీమీటర్లు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమలో 8.6 సెంటీమీటర్లు
బాపట్ల జిల్లాలో 6.4 సెంటీమీటర్లు
కృష్ణా జిల్లాలో 5.5 సెంటీమీటర్లు
నెల్లూరు జిల్లాలో 5.4 సెంటీమీటర్లు
గుంటూరు జిల్లాలో 3.3 సెంటీమీటర్లు
విశాఖలో 3.1 సెంటీమీటర్లు
అన్నమయ్య జిల్లాలో 3 సెంటీమీటర్లు
కాకినాడలో 2.7 సెంటీమీటర్లు
తూర్పు గోదావరిలో 2.1 సెంటీమీటర్లు
కడప జిల్లాలో 2.4 సెంటీమీటర్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో 2.3 సెంటీమీటర్లు
మంగళవారం మద్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటిన మిచౌంగ్ తుపాను క్రమంగా తుపానుగా బలహీనపడి ఏపీ భూభాగం దాటేంతవరకూ వర్షాలు పడనున్నాయి. క్రమంగా ఇది వాయుగుండంగా, ఆపై అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర వైపు వెళ్లనుండటంతో ఈ ప్రాంతంలో వర్షాలు పడవచ్చు.
Also read: Tornados in cyclone: రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం రేపిన సుడిగాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook