Ticket Price: సినిమా టికెట్ ధరలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
Grandhi Viswanath Meets To Pawan Kalyan: సినిమా థియేటర్ టికెట్లు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి అయిన సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
Cinema Ticket Price: తెలుగు చిత్ర పరిశ్రమను సినిమా థియేటర్ టికెట్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్మాతలు టికెట్ ధర పెంపును సమర్ధిస్తుండడంతో మరోసారి పరిశ్రమలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం వస్తే మేలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టికెట్ ధరల తగ్గింపు, సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read: Gudivada Amarnath: ఏపీ మద్యం టెండర్లలో భారీ కుంభకోణం.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంథి విశ్వనాథ్ బృందం అమరావతిలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా టికెట్ల ధరలతోపాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. సినీ పరిశ్రమ కోసం కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిని అమలు చేస్తే సినీ పరిశ్రమకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
Also Read: Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని పవన్ కల్యాణ్‌కు అందజేశారు.
సమావేశం అనంతరం గ్రంథి విశ్వనాథ్ మాట్లాడుతూ.. 'ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా సమంజసంగా లేదనే భావన పేదలను సినిమాకు దూరం చేస్తోంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుందని చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందని.. అది ఏపీలో అమలు చేయాలని కోరారు. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారని చెప్పారు. తాము చేసిన ప్రతిపాదనలను పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి