Pithapuram Floods: వరదల్లో డిప్యూటీ సీఎం ఇంటి స్థలం.. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్
Pawan Kalyan House Land Drowned In Floods And Pithapuram Also Affected: వరదలతో అల్లాడుతున్న ఏపీకి అండగా నిలవాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో గడుపుతున్నారు. తాజాగా పిఠాపురాన్ని కూడా వరదలు చుట్టుముట్టాయి. ఆయన ఇంటి స్థలం కూడా మునిగిపోవడం గమనార్హం.
Pawan Kalyan House Land Drowned: ఎన్నికల సమయంలో అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. కారణం అక్కడి నుంచి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. కూటమి సహాయంతో ఆయన భారీ మెజార్టీతో గెలవడంతో పిఠాపురం దశ మారుతుందని అందరూ భావించగా.. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పరిస్థితి మారలేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలైనా పిఠాపురంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వరదలు చుట్టుముట్టాయి. అయితే వరదలపై ముందు నుంచే నిర్లక్ష్యంగా ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. చుట్టపు చూపుగా ఒకరోజు వరద ప్రాంతాల్లో పర్యటించి హైదరాబాద్‌కు చెక్కేశారు. కానీ మంగళవారం మళ్లీ పిఠాపురం నియోజకవర్గంలో వరద ముప్పు మరింత తీవ్రమైంది.
Also Read: AP Debts: మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు అర లక్ష కోట్లు.. బాబు పాలనలో భారీగా అప్పులు
వరద తీవ్రం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి స్థలం కూడా మునిగిపోయింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య 216 జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి స్థలం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచాక సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 3 ఎకరాల 52 సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. ఏలేరు వరద ప్రభావంతో ఇంటి నిర్మాణ స్థలం నీటి ముంపులో చిక్కుకుంది.
Also Read: Munneru Swimmng: మద్యంమత్తులో మున్నేరు నదిలో దూకిన యువకులు
వరదల్లో చిక్కుకున్న ఆరుగురు
పిఠాపురం నియోజకవర్గంలో వరద తీవ్ర రూపం దాల్చుతోంది. పిఠాపురం మండలం రాపర్తి వద్ద ఏలేరు గొరికి కండ్రి గండి తెగిపోయింది. దీంతో జమునపల్లి రాపర్తి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గండి తెగడంతో పోటెత్తిన వరద నీటిలో ఆరుగురు యువకులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా జములపల్లి గ్రామంలో 30 పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరుగురు యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు
మళ్లీ హైదరాబాద్?
ఆంధ్రప్రదేశ్‌లో వరదలు తీవ్ర రూపం దాలుస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం దూరంగా ఉంటున్నారు. విజయవాడ వరదల సమయంలో కూడా దూరంగా ఉన్నారు. ఆరోజు ఆయన పుట్టిన రోజు సంబరాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత రోజు వచ్చి కొన్ని రోజులు హడావుడి చేశారు. విజయవాడ వరదలకు తోడు పిఠాపురంలో కూడా వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం సొంత నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ చుట్టుపుచూపుగా పర్యటించారు. అనంతరం వెంటనే అదేరోజు హైదరాబాద్‌కు చెక్కేశారు.
వరదలో సమయంలో పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ స్పష్టతనిస్తోంది. తమ అధినేత ఎక్కడున్నా పిఠాపురం గురించే ఆలోచిస్తారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. తన శాఖ అధికారులతో ఫోన్‌లైన్‌లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారని వివరణ ఇస్తున్నారు. దీనికి సాక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం అధికారిక హ్యాండిల్‌లో అధికారులతో సమీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter