Pithapuram: తెలుగు రాష్ట్రాలను ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక దృష్టి ఏర్పడింది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట ఇచ్చాడంటే అది తప్పక తీరుస్తారనే నమ్మకం ఏర్పడుతోంది. తాను లేకున్నా కూడా నియోజకవర్గంలో పనులు శరవేగంగా జరిగేలా ఏర్పాట్లు చేయడం విశేషం. తాజాగా విద్యార్థుల తాగునీటి గోసను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీర్చారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: 'దిశా' లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం


 


పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో చేసిన పర్యటనలు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారంపై దృష్టి సారించారు. అత్యవసరంగా గుర్తించిన వివిధ పనులను చకాచకా చేసేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం మూడుసార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చినా సరే నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుండడం విశేషం. తాజాగా పిఠాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీటి సమస్యను పరిష్కరించారు.

Also Read: YS Sharmila: రూ.99కే క్వార్టర్‌ సీసా ఇస్తే అత్యాచారాలు జరుగుతాయి? మద్యంపై వైఎస్‌ షర్మిల ఆందోళన


 


కొన్ని నెలలుగా ఆర్‌ఓ ప్లాంట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు రక్షిత తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి  పేషీ అధికారులు గుర్తించారు. వెంటనే కళాశాలలో ఆర్ఓ ప్లాంట్ మరమ్మతు పనులు నిర్వహించి విద్యార్థులకు  రక్షిత తాగునీరు అందించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం కావడంతో విద్యార్థులకు తాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి.


ఇక మరో సమస్యకు కూడా డిప్యూటీ సీఎం పరిష్కారం చూపారు. గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాలకు నాలుగేళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం దాని సమస్య పరిష్కారానికి కృషి చేశారు. సమీపంలోని రైస్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి మిల్లు నుంచి పాఠశాలకు పైపులైన్‌ ఏర్పాటు చేయించారు. రూ.4 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో తాగునీటి సరఫరా కల్పించారు.


గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు  పరిష్కారం
పిఠాపురం సామాజిక ఆరగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్ రే యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓతో చర్చించి పిఠాపురం సీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్యాధికారి, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు జనరల్ డ్యూటీ అంటెండెంటట్‌లు నియామకం కావడంతో పిఠాపురం ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిజం చేసేలా దేశం దృష్టిని పిఠాపురం ఆకర్షించేలా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చర్యలు చేపడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter