COVID-19 in AP: 24 గంటల్లో 68 మంది మృతి
ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,167 మందికి కరోనావైరస్ ( Coronavirus) సోకినట్టు నిర్ధారణ అయింది.
అమరావతి : ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,167 మందికి కరోనావైరస్ ( Coronavirus) సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 1,30,557కి చేరింది. అదే సమయంలో కరోనాతో 68 మంది మృతిచెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 1,281 కు చేరింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 69,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also read: Hardik Pandya: పెళ్లి కాకుండానే తండ్రిగా అయిన హార్థిక్ పాండ్యా
గత 24 గంటల్లో 4,618 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 60,024 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. Also read: మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి