Andhra Pradesh: లక్ష దాటిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ సోమవారం ఉదయం 9 గంటల మధ్య 43,127 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ సోమవారం ఉదయం 9 గంటల మధ్య 43,127 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల్లో 49 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 1090 కి చేరుకుంది. ఏపీలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 1,02,349 కు చేరింది. ఈ పరీక్షలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,86,446 కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేశామని ఏపీ సర్కార్ వెల్లడించింది. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 49,558 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,701 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ నేడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. Also read: Chicken prices: కిలో చికెన్ ధర రూ.500