Doctors removed 570 stones from womans stomach in amalapuram: కొన్నిసార్లు మనం సాధారణంగా డాక్టర్ ల దగ్గరకు వెళ్తుంటాం. కానీ డాక్టర్ లు స్కానింగ్ లు, టెస్టులు చేసిన తర్వాత అసలైన వ్యాధి ఏంటో బైట పడుతుంది. మన పనుల్లో రోటీన్ గా ఉంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం.. ఒక్కసారిగా ఆరోగ్యం పాడైపోతుంది. తీరా డాక్టర్ ల దగ్గరకు వెళ్తే అసలు ప్రాబ్లమ్ ఏంటో బైటపడుతుంది. తమ బిజీ లైఫ్, టైట్ షెడ్యూల్ వల్ల చాలా మంది ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ద చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో హెల్త్ అనేది పాడైపోతుంది. చివరకు మనం భరించలేని బాధతో ఉన్నప్పుడు మాత్రమే ఆస్పత్రికి వెళ్తాం. అప్పుడు డాక్టర్లు మనకు టెస్టులు చేసి, మనకు వచ్చిన జబ్బులను చెప్తారు. కానీ అప్పటికే అది ముదిరి పాకాన పడిపోయి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఏ వ్యాధి అయిన ఆరంభదశలో గుర్తుపడితే , దాన్ని తగ్గించుకొవడం సులువుగా ఉంటుంది. కానీ అది అడ్వాన్స్ దశలోకి వెళ్లిపోయాక మాత్రం దాన్ని నయం చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు మన నెగ్జీజెన్సీ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు  కూడా ఏర్పడవచ్చు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. 


ఆంధ్ర ప్రదేశ్ లో అంబేద్కర్ కోనసిమా జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన నరసావేణి అనే మహిళ కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతుంది. ఆమె ఇంటి దగ్గర మెడికల్ లకు వెళ్లి పెయిన్ కిల్లర్ లు వేసుకునేది. అంతేకాకుండా.. తన ఆరోగ్యంను పూర్తిగా పట్టించుకునేదికాదు. కడుపునొప్పి అన్పించగానే అది, నెలసరి నొప్పిగా భావించేది. ట్యాబ్లెట్ లు వాడి, ఊరుకునేది. ఇలా కొన్నినెలలు గడిచిపోయాయి. ఇటీవల మహిళకు కడుపు నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఆమె బాధను భరించలేక పోయింది. వెంటనే అమలాపురంలోని ఏఎస్ఏ అస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు స్కానింగ్, టెస్టులు చేసిన కడుపులో రాళ్లు ఉన్నట్లు తెలిపారు.


Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..


స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ లు ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జరీ చేయాలని బాధిత కుటుంబానికి కూడా సూచించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని వైద్యులు.. బాధితురాలికి అనస్తీషియా ఇచ్చి కొన్ని గంటల పాటు శ్రమించి కడుపులో ఉన్న రాళ్లను తొలగించారు.  బాధితురాలి కడుపులో నుంచి వైద్యులు .. 570 రాళ్లను బైటకు తీశారు. కడుపులో నుంచి ఇన్ని రాళ్లు బైటకు తీయడం చాలా అరుదని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, తొందరలోనే డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter