Drone Show: డ్రోన్ల రాజధానిగా అమరావతి.. దానికే నేనే బ్రాండ్ అంబాసిడర్: సీఎం చంద్రబాబు
Amaravati Drone Summit: అమరావతి డ్రోన్ సమ్మిట్ భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీలో గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టెక్నాలజీనే దేశానికి అన్నం పెడుతుందని పునరుద్ఘాటించారు.
Punnami Ghat: డ్రోన్ల టెక్నాలజీని వినియోగించుకోని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భవిష్యత్తులో డ్రోన్లు గేమ్ ఛేంజర్లుగా చెప్పొచ్చని పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ కచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడానికి టెక్నాలజీని వినియోగించుకుంటామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ల పాలసీని తీసుకొస్తామని చెప్పారు.
Also Read: YS Jagan: బాధితులకు వైఎస్ జగన్ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటన
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్స్‌లో మంగళవారం నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డ్రోన్ల టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ అని తనను తాను ప్రకటించుకున్నారు. డ్రోన్ల టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని.. డ్రోన్ టెక్నాలజీకి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నిలుపుతానని ప్రకటించారు.
Also Read: Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
'టెక్నాలజీలో భారత్ బలమైన దేశమని ఎప్పుడో చెప్పా. సెల్‌ఫోన్ అన్నం పెడుతుందా అంటూ నాడు వెకిలిగా మాట్లాడారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. అడ్వాన్స్ డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలు, యాప్‌లు, ఇతర టెక్నాలజీ పరికరాల వినియోగంలో ముందున్నాం' అని చంద్రబాబు వివరించారు.
'ఐటీ గురించి మాట్లాడిన సందర్భంలో ఉద్యోగాలు చేయడమే కాదు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని చెప్పాను. ఇప్పుడు దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నివాస యోగ్య నగరం అని గర్వంగా చెబుతున్నారు. ఒక డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. వికసిత్ భారత్ 2047 ద్వారా ఇండియాను ప్రపంచంలో తొలి రెండు స్థానాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని బలంగా నమ్ముతున్నా. రాబోయే కాలం అంతా డేటాదే. ఎంత డేటా ఉంటే దేశానికి పెట్టుబడిదారులకు అంత బాగుంటుంది' అని పేర్కొన్నారు.
వరద సహాయాల్లో..
'కృత్రిమ మేధా (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ద్వారా నిర్ధిష్టమైన సమాచారాన్ని పొందవచ్చు. డ్రోన్స్‌ను మనం ఎక్కడికైనా పంపవచ్చు. సరైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. విజయవాడ వరదల్లో బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించాం' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. భవిష్యత్తులో డ్రోన్లు గేమ్ ఛేంజర్లుగా చెప్పొచ్చని పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి డ్రోన్లను వినియోగించవచ్చని వివరించారు. ప్రతి అంశంలోనూ కచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడానికి టెక్నాలజీని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
డ్రోన్ సిటీ అమరావతి
'నాకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. ఇండియాకు రెండంకెల వృద్ధిరేటు సాధించే సత్తా ఉంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల సలహాలు, సూచనలతో డ్రోన్ పాలసీని ప్రవేశపెడతాం. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని ఆవిష్కరిస్తాం' అని చంద్రబాబు ప్రకటించారు. కనీసం 35 వేలకు పైగా డ్రోన్ ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దుతామని లక్ష్యం వివరించారు.
నేనే బ్రాండ్ అంబాసిడర్
'ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. అక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రోన్ల తయారీకి నేను అంబాసిడర్‌గా ఉంటాను. మీ మార్కెట్ ను ప్రమోట్ చేస్తా' అని చంద్రబాబు చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కూడా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో కూడా భాగస్వాములవుతున్నారని వెల్లడించారు. సమష్టి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని డ్రోన్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో ప్రధాన కార్యాలయం, విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఉంటాయి. 2047 నాటికి ఒక కుటుంబం. ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది నా అభిమతం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter