Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

Chandrababu Diwali Gift Full Details Of Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వ నెరవేర్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 21, 2024, 07:52 PM IST
Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

Deepam Scheme Details: మహిళలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించారు. దీపావళి పండుగ నుంచి దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్‌లను అమలుచేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టి సారించింది.

Also Read: YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్‌ జగన్‌ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహం

 

సూపర్‌ సిక్స్‌లో భాగమైన దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని వివరించారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎం

 

దీపం పథకంపై వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో  సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో రూ.2 వేల 684 కోట్లు, ఐదేళ్లకు కలిపి రూ.13,423 కోట్ల అదనపు భారం పడుతుందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై చర్చించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు.

అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింపచేయాలని అధికారులకు ఆదేశించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రతి నాలుగు నెలల్లో ఎప్పుడైనా లబ్దిదారుకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని.. 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో దీపం పథకం తీసుకొచ్చామని గుర్తించారు. అర్హత కలిగిన లబ్దిదారులందరికీ ఈ పథకం అందించాలని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News