Election Commission: ఏపీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు ఐపీఎస్ అధికారులపై వేటు వేసి ఆ స్థానంలో ఇద్దరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో కొత్త అధికారుల నియామకం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది. ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు అదనపు డీజీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలు పంపించాలని సూచించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ముగ్గురేసి అదికారుల ప్రతిపాదన పరిశీలించిన ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది విజయవాడ పోలీస్ కమీషనర్‌గా 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పీహెచ్‌డి రామకృష్ణను నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తక్షణం విజయవాడ సీపీగా బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 


ఇక ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను నియమించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ అదనపు డీజీ ర్యాంకులో ఉన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ సీపీగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటాపై ఫిర్యాదుల నేపధ్యంలో ఎన్నికల సంఘం విధుల్నించి తప్పించింది. 


Also read: AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకు ఆదేశాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook