AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకు ఆదేశాలు

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాలంటీర్ల రాజీనామాలపై విచారణ జరుగుతోంది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశించిన న్యాయస్థానం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2024, 05:19 PM IST
AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకు ఆదేశాలు

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధుల్నించి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల తరువాత వాలంటీర్ల రాజీనామాలు ఊపందుకున్నాయి. పెద్దఎత్తున వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. ఈ వ్యవహారంపైనే ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. 

ఏపీలో వాలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకు మద్దతుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విధుల్నించి దూరంగా ఉండాలన్న ఈసీ ఆదేశాల తరువాత ఈ ప్రక్రియ ఊపందుకుంది. దీనిని నియంత్రించేందుకు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకూడదంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 62 వేల మంది వాలంటీర్లు రాజీనామాలు సమర్పించారు. 

రాజీనామాలు ఆమోదిస్తే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా వ్యవహరిస్తారనేది పిటీషనర్ ఆరోపణగా ఉంది. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలున్నాయని పిటీషనర్ తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈ అధికారాలు ఉపోయిగంచుకుని వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ కోరారు. ఈ అంశంపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. 

Also read: AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News