Glass Symbol Issue: ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించడంతో జనసేనతో సహా కూటమి అభ్యర్ధులకు షాక్ తగిలింది. దాంతో గాజు గ్లాసు ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ జనసేన, టీడీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాజు గ్లాజు గుర్తు విషయంలో అటు జనసేనకు ఇటు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గాజు గ్లాసు వివాదంపై ఎన్నికల కమీషన్‌ను హైకోర్టును 24 గంటల సమయం అడిగి తీసుకుంది. ఇవాళ కీలక విషయాలు హైకోర్టుకు వివరించింది. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ స్థానాల్లో ఎంపీ అభ్యర్ధులకు, రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించమని స్పష్టం చేసింది. అంటే మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్న తెలుగుదేశం, బీజేపీ అభ్యర్ధులకు గాజు గ్లాసు పోటు తప్పదని తెలుస్తోంది. 


జనసేన తాను పోటీ చేసే స్థానాల్లోనే కాకుండా ఇతర స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించవద్దని హైకోర్టు కోరింది. ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసును అలా కేటాయించకుండా ఉండటం సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని హైకోర్టుకు తేల్చిచెప్పింది. దాంతో జనసేన-తెలుగుదేశం ఏం చేస్తాయనేది ఆసక్తిగా మారింది.


Also read: Mahindra XUV 3XO: కేవలం 7.49 లక్షలకే Mahindra XUV 3XO లాంచ్, మే 15 నుంచి బుకింగ్స్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook