Election Commission: ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం రెండు అంశాల్లో నిరాశ మిగిల్చింది. ఏపీ టెట్ 2024 ఫలితాల వెల్లడి, ఏపీ డీఎస్సీ 2024 పరీక్షల నిర్వహణను ఎన్నికల కోడ్ ముగిసేవరకూ వాయిదా వేయాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ వంటి సంక్షేమ పధకాలకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 1న పింఛన్ల పంపిణీ ప్రక్రియకు విఘాతం ఏర్పడవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల వేళ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా వాలంటీర్లతో పంపిణీని నిలిపివేయించేందుకు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన ఫోన్లు, ట్యాబ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కోడ్ ముగిసేవరకూ పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీని వాలంటీర్లతో చేయించవద్దని ఈసీ స్పష్టం చేసింది. సంక్షేమ పధకాల పంపిణీకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 


పింఛన్ల పంపిణీ ఏప్రిల్ 1న జరగాల్సి ఉంది. అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే గడువుంది. ఈ క్రమంలో ఇంత హఠాత్తుగా పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించి ప్రత్యామ్నాయ మార్గాలు చూడటం దాదాపు కష్టం. అంటే ఈసీ ఆదేశాల కారణంగా రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులకు అందాల్సిన పింఛన్ ప్రక్రియ ఈసారి ఆలస్యం కావచ్చు. 


Also read: Election Commission: డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలు ఎన్నికలు ముగిసేవరకూ వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook