ఎన్నికల వేళ ధన ప్రవాహం; హైద్రాబాద్ లో భారీగా నగదు పట్టివేత
ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు నోట్లను ఎరవేస్తున్నాయి
ఎన్నికల వేళ ధవ ప్రవాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఓటర్లను ఆరక్షించేందుకు రాజకీయ పార్టీల నేతలు నోట్లతో ఎరవేస్తున్నారు. ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది. ఈ క్రమంలో నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. సోమవారం రాత్రి లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖిల్లో భాగంగా కారులో అక్రమంగా తరలిస్తున్న భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టపడిన నగదు రూ.2.4 కోట్ల ఉన్నట్లు సమాచారం
కాగా నగదు స్వాధీనం చేసకున్న పోలీసులు...వాహనంలో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు కారును సీజ్ చేశారు.. ఈ నగదును ఎవరు పంపారు? ఎవరికి అందించేందుకు తీసుకెళుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్నికల వేళ నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించినప్పటికి ఓటుకు నోటు పంపిణీ జరుగుతుండం గమనార్హం