విజయవాడ బస్ స్టేషన్‌లో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. నూరుశాతం విద్యుత్ ఆధారితంగా నడిచే ఈ బస్సులను విజయవాడలో ప్రయోగాత్మకంగా నడపడానికి ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. గోల్డ్‌స్టోన్‌ కంపెనీ ఆధ్వర్యంలో తయారైన ఈ బస్సులు ఎలా నడపాలో తెలియజేస్తూ.. ఇప్పటికే సంస్థ నిపుణులు ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా విజయవాడను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకే ఈ ప్రయత్నమని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. ఈ బ్యాటరీలకు దాదాపు నాలుగు గంటల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది.


ప్రస్తుతం విజయవాడ బస్ స్టేషన్ గ్యారేజీలోనే తాత్కాలికంగా ఈ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. 47 సీట్లతో నడిచే ఈ బస్సులలో సీసీ టీవి కెమెరాలు కూడా ఉంటాయి. ఈ బస్సు ఖరీదు దాదాపు 3 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 లక్షల రూపాయలను ఒక్కో బస్సుకి సబ్సీడి ఇవ్వనుంది.