Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్ల ఎన్నికల్లో హైకోర్టు(Ap High Court) ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ నిలిపివేశారు. మిగిలిన ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందుభి మోగించింది.హైకోర్టు ఇప్పుడు తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మరి కాస్సేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఏలూరు శివార్లలోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 47 డివిజన్లకు సంబంంధించి 48 టేబుల్స్‌పై ఒకే ఒక రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ కోసం నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమేరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ (Eluru Counting)సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు, మాస్క్, ఫేస్‌షీల్డ్ లేకుండా అనుమతి లేదు. విజయోత్సవ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఏలూరు కార్పొరేషన్ (Eluru Corporation)పరిధిలోని మొత్తం 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు(Ysr Congress Party) ఏకగ్రీవం కాగా..మిగిలిన 47 డివిజన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు రావల్సి ఉంది. 


Also read: Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం ఇకపై మరింత ఉధృతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook