YS SHARMILA: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సొదరి షర్మిల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చెల్లి షర్మిల రాజకీయ భవిష్యత్తుకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలతో జగన్‌ ఓ ప్లాన్‌ రెడీ చేసినట్టు సమాచారం. తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న షర్మిలను ఇకమీదట కట్టడి చేయకపోతే.. మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని భావిస్తున్నారట. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక పదేపదే షర్మిల జగన్‌ను టార్గెట్‌ చేశారు. ప్రభుత్వాన్ని వదిలేసి తనపైనే బాణం ఎక్కుపెట్టారని టెన్షన్‌ పడుతున్నారట. అందుకే షర్మిలను ఏపీసీసీ చీఫ్‌ పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్‌ పెద్దలతో జగన్‌ చర్చలు జరిపినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయి దాదాపు ఆర్నెళ్లు దాటింది. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ వివేకా మరణం తర్వాత.. అన్న చెల్లి మధ్య విబేధాలు పొడసూపాయి. ఆ తర్వాత ఆస్తి పంపకాల వివాదంతో చివరి అంకానికి చేరాయి. అయితే ఎన్నికలకు ముందు నుంచి జగన్‌ ను టార్గెట్‌ చేసినా షర్మిల పరోక్షంగా కూటమి పార్టీ గెలుపుకు కారణమయ్యారు. దాంతో తాను మరోమారు ముఖ్యమంత్రి కాకుండా షర్మిలే అడ్డుకున్నారని జగన్‌ గుస్సామీద ఉన్నారు. ఆ తర్వాత అన్న చెల్లి మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమనేలా పరిస్ధితులు తలెత్తాయి. అయితే పరిస్ధితులు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉందని భావిస్తున్నారట. అందుకే షర్మిలకు చెక్‌ పెట్టాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది..


ఇందులో భాగంగానే.. వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ పెద్దలతో ఏపీసీసీ చీఫ్‌ను మార్చాలని కోరారట.. ప్రస్తుతం రాష్ట్రంలో షర్మిల ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇదే సమయంలో గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి పనిచేసినా నేతలకు కూడా టచ్‌లోకి వెళ్లారట.. షర్మిల తీరుపై ఫిర్యాదు చేయాలని వారితో కూడా చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉండగానే.. మరో అస్త్రాన్ని సైతం ప్రయోగించినట్టు తెలిసింది. తాజాగా వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లాలో పర్యటించారు. పార్టీకి చెందిన తెర్నెకల్ సురేంద్ర రెడ్డి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ పెళ్లికి వచ్చిన కాంగ్రెస్ నేతలతో జగన్ చర్చలు జరిపినట్టు సమాచారం. గతంలో జగన్‌ కేబినెట్‌లో కీలకమంత్రిగా వ్యవహరించిన మాజీమంత్రి శైలాజనాథ్‌తో పాటు.. ఇతర నేతలతో చర్చలు జరిపారట.. వారిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారట. అయితే కూటమి పార్టీలోకి వెళ్లడం ఇష్టంలేని ఆ నేతలు.. జగన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. అయితే శైలజానాథ్‌తో పాటు మరో 8 మంది కాంగ్రెస్ సీనియర్‌ నేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని చెబుతున్నారు..


మొత్తంగా జగన్‌ తీరుపై గుస్సాగా ఉన్న వైఎస్ షర్మిల.. ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. తన పదవికే ఎసరు పెడుతున్న అన్న జగన్‌ను చూస్తూ ఊరుకుంటారా.. లేక గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతారా అనేది చూడాల్సి ఉంది.. మొత్తంగా అన్న- చెల్లి మధ్య ఫైట్‌.. మాత్రం వచ్చే ఎన్నికల్లో మరింత ఆసక్తిరేపడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది..


Also Read: Palla Srinivas Rao: కేబినెట్‌లోకి పల్లా శ్రీనివాస్‌ రావు!


Also Read: Kadapa Mayor: మళ్లీ మేయర్ వర్సెస్‌ టీడీపీ ఎమ్మెల్యే మధ్య రచ్చరచ్చ.. 'కడప'లో కుర్చీల లొల్లి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.