EX CM JAGAN: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత..వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో జగన్ అధికారం కోల్పోగానే.. నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కూటమి సర్కార్‌ దెబ్బకు కొందరు నేతలైతే.. చేసేదేమీ లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు అధికార పార్టీలోనూ చేరిపోయారు.. కానీ.. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో కీలక లీడర్‌గా వ్యవహరించిన మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ కూడా ఇప్పుడు పక్కా రాష్ట్రంలో తలదాచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే నరసరావుపేటలో రాజకీయం చేయలేక.. నెల్లూరుకు రాలేక ఆయన సతమతం అవుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Ethanol Industry: రేవంత్ సొంత జిల్లాలో మరో డేంజరస్ కంపెనీ.. ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం


గత అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు నుంచి రెండుసార్లు గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఏకంగా మంత్రి పదవిలో కూర్చున్నారు. అయితే మంత్రి కాగానే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఇటీవల ప్యాన్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే కూటమి సర్కార్‌ కేసులకు భయపడే అనిల్ కుమార్‌ యాదవ్‌ సైలెంట్‌గా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. స


ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఓటమి పాలయ్యారు. అనిల్‌ గతంలో నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధిస్తే.. ఈసారి మాత్రం ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే నెల్లూరులో కీలకంగా ఉన్న తనను నరసాపురం సమన్వయకర్తగా పంపడంపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. కనీసం నెల్లూరు నుంచి పోటీలో ఉండుంటే.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేవాడినని ఆయన అనుచరులతో చెబుతున్నట్టు తెలిసింది. ఇదే విషయమై కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం నరసారావుపేటకు గుడ్‌బై చెప్పేసిన అనిల్ కుమార్ యాదవ్‌.. చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అప్పడప్పుడు నెల్లూరుకు వచ్చినా కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలిసింది.


మొత్తంగా కూటమి సర్కార్‌ పెడుతున్న కేసులకు భయపడే అనిల్‌ కుమార్ యాదవ్‌ మకాం చెన్నైకి మార్చినట్టు తెలుస్తోంది. అయితే అనిల్‌ సైలెండ్ మోడ్ వైసీపీ క్యాడర్‌ను పరేషాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. నరసారావుపేటకు ఆయన ముఖం చాటేసి నెల్లూరుకు మకాం మార్చడం క్యాడర్‌కు ఇబ్బందిగా మారిందట. అయితే అధికారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్‌కు కీలక సమయంలో అండగా లేకుండా పోవడంపైన పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉంటున్నట్టు తెలిసింది. చూడాలి మరి అనిల్‌ మళ్లీ యాక్టివ్‌ అవుతారా.. లేదంటే వచ్చే ఎన్నికల వరకు చెన్నైకే పరిమితం అవుతారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సందే అంటున్నారు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter