Ethanol Industry Effected Farmers: లగచర్ల సంఘటనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. తాజాగా అతడి సొంత జిల్లాలో మరో ప్రమాదకర కంపెనీ ఏర్పాటు చేస్తున్నారనే వార్త కలకలం రేపింది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందనే వార్తలు రావడంతో స్థానిక పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కంపెనీని ఎలా అనుమతిస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా కంపెనీ ఏర్పాటుపై కలెక్టర్‌తో అమీతుమీ తేల్చుకున్నారు.
Also Read: Kishan Reddy: రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌కు కిషన్ రెడ్డి సై.. రేపు మూసీ ఒడ్డున నిద్ర.. భోజనం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ, మాన్‌దొడ్డి, చిన్న తాండ్రపాడు, వేణి సోంపురం, కేశవరం, తుమ్మిళ్ల, పచర్ల, చిన్న ధన్వాడ, రాజోలి గ్రామాల పరిసరాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఏడాది కాలంగా ఈ పరిశ్రమ ఏర్పాటుపై ఆ గ్రామాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. లగచర్లలో చోటుచేసుకున్న మాదిరి అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై లగచర్ల గ్రామస్తులు, రైతులు దాడి చేసిన సంఘటనతో ఇథనాల్ పరిశ్రమ బాధిత గ్రామస్తులు స్పందించారు. తమ ప్రాంతంలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Praja Palana: కనీవినీ ఎరుగని రీతిలో రేవంత్ రెడ్డి ఏడాది పాలన విజయోత్సవాలు
ఈ క్రమంలో ఇథనాల్ పరిశ్రమ బాధితులు బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను కలిశారు. గద్వాలలోని ఆమె నివాసంలో ఎంపీ అరుణను కలిసి ఇథనాల్ భూ బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అబివృద్ది పేరుతో తమ భూములు లాక్కోవాలని చూస్తున్నారని వాపోయారు. ఇథనాల్ పరిశ్రమ వస్తే తమ గ్రామాలకు రేడియేషన్‌తోపాటు ఇతర ప్రమాదకర సమస్యలు వస్తాయని బాధిత గ్రామాల రైతులు వాపోయారు.
రైతుల బాధలు విన్న ఎంపీ డీకే అరుణ వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇథనాల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందనే వస్తుందనే ఆరోపణలు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టకుండానే కేంద్రం అనుమతి ఇస్తదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు పెట్టాలని ఎవరూ అనుమతించరని స్పష్టం చేశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై పూర్తిస్థాయి డీపీఆర్ పంపాలని కలెక్టర్‌ను ఎంపీ అరుణ కోరారు. బాధితులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకుండా ఇథనాల్ పరిశ్రమ పనులు మొదలు పెట్టొద్దని ఆల్టిమేటం జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter