Avanthi Srinivas Resigns to YSRCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు.. వైఎస్ జగన్‌కు ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు మాజీ మంత్రులు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్ రంగంలోకి దిగి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి.. కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా.. వలసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో కీలక నాయకుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నానని.. తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి కనీం ఏడాది సమయం ఇవ్వాల్సిందన్నారు. అప్పుడే ధర్నాల పేరు హడావుడి చేయడం సరికాదని అన్నారు. తాను 2009లో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. చిరంజీవి, నాగబాబు ఆశీర్వాదంతోనే భీమిలి ఎమ్మెల్యే గెలిచానని అన్నారు. తాడేపల్లి అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కాగా.. ఆయన జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే అవంతి శ్రీనివాస్ ఆ పార్టీలో చేరారు. 2009లో భీమిలి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం తరువాత కొద్దిరోజులు కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి.. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి షాకిస్తూ.. వైసీపీలో చేరిపోయారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేశారు. 2024 ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి పోటీ చేయగా.. గంటా శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా.. తాజాగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 


Also Read: Gold Rates Today: పరుగులు పెడుతున్న పసిడి.. వెయ్యి తగ్గిన వెండి..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ?


Also Read: EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.