RK Roja: కొన్ని రోజులుగా కొనసాగుతున్న తిరుమల లడ్డూ వివాదంపై ఫైర్‌ బ్రాండ్‌ ఆర్‌కే రోజా నోరు విప్పారు. తిరుమల ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నాయకురాలు..మంత్రిగా అత్యధిక సార్లు తిరుమలను సందర్శించుకున్న రోజా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్‌ ప్రాయశ్చిత దీక్షపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirupati Laddu: నాడు శ్రీరాముడి విగ్రహం తల నరికితే ఎవరూ మాట్లాడలే? ఇప్పుడు? పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం


 


'చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించేలా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు' అని రోజా ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని మండిపడ్డారు.

Also Read: Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటన


 


'చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి.. పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు ఛీకొడుతున్నారు' అని రోజా తెలిపారు. 'జగన్ జంతువు కొవ్వు మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు' అని పేర్కొన్నారు. ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు చెబితే ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.


'జూలై 23వ తేదీన కూరగాయల నూనె మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్‌మీట్ పెట్టించారు' అని రోజా ఆరోపణలు చేశారు. 'మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావా??' అని ప్రశ్నించారు. 


'వైఎస్‌ జగన్ అధికారంలో ఉన్న సమయంలో మోదీ, సీజేఐలు, చంద్రబాబు కూడా కుటుంబంతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే విచారణ ఇవ్వాలి కదా!' అని రోజా నిలదీశారు. 'ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా చేయడం ఎంతవరకు సమంజసం?' అని ప్రశ్నించారు. 'బీజేపీ నాయకులు కూడా గత పాలకమండలిలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?' అని సందేహం వ్యక్తం చేశారు.


పవన్‌ దీక్షపై
'ఈరోజు ప్రాయిశ్చిత దీక్ష చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారు? తప్పుచేసినవారు చేస్తారు. అంటే ప్రభుత్వంలో ఉన్నాం. తిరుమల పాపంలో భాగం ఉండడంతోనే దీక్షచేస్తున్నానని పవన్‌ అంగీకరించారు' అని మాజీ మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.