CHITTUR POLITICS: జైలు కెళ్తాం.. మేమంతా రెడీ!
CHEVIREDDY BHASKAR REDDY: వైసీపీ లీడర్లు రూట్ మార్చారా..! కూటమి సర్కార్‌కు భయపడొద్దని డిసైడ్ అయ్యారా..! ఇప్పటికే తమపై నమోదైన కేసుల విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా..! చంద్రబాబు సర్కార్ కటాకటాల వెనక్కి పంపితే.. తాము సిద్దంగా ఉన్నామని ఎందుకు సవాళ్లు విసురుతున్నారు.. తమనే ముందు అరెస్టు చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు.. దీని వెనుక ఉన్న వ్యూహామేంటి..!
CHEVIREDDY BHASKAR REDDY: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చి ఆర్నెళ్లు దాటింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించాక.. వైసీపీ నేతలను వెంటాడుతున్నారు. వరుస కేసులతో ఫ్యాన్ పార్టీ లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరు నేతలైతే సీఎం చంద్రబాబు దెబ్బకు ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరికొందరు నాయకులు మాత్రం ఈ కేసుల గొడవ తమకెందుకు అన్నట్టుగా అధికార పార్టీలో చేరిపోయారు. కానీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న కొందరు లీడర్లు మాత్రం ఇప్పుడు రూట్ మార్చినట్టు తెలుస్తోంది. ఇకమీదట కేసులకు భయపడకుండా ఓ సారి జైలుకు పోయోస్తే పోలా అని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
అయితే వైసీపీ లీడర్లు రూట్ మార్చడం వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్‌కు భయపడి ఇంకెన్నాళ్లు ఇంటికే పరిమితం అవుతాం.. ఓసారి జైలుకు పోయేస్తే పోలా అని భావిస్తున్నారట. ఓకసారి జైలుకు వెళ్లడం ద్వారా.. పబ్లిసిటికి పబ్లిసిటీ.. సానుభూతికి సానుభూతి దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారట.. గతంలో జైలుకు వెళ్లిన నేతలు పెద్ద పెద్ద పదవులను చేపట్టిన విషయాన్ని కూడా ఈ నేతలు గుర్తు చేస్తున్నారట. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కూటమి సర్కార్ తనను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. గతంలోనూ తనపై 80 కి పైగా కేసులు నమోదు చేశారని.. ఇప్పుడు అరెస్టు చేస్తే చేస్కోండి.. తాను జైలుకు వెళ్లేందుకు సిద్దమని ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం వైసీపీ లీడర్లలో వల్లభనేని వంశీ, కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి లీడర్లు సైలెంట్ అయ్యారు. వీరిలో అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్తున్నారు. అరెస్టు భయంతోనే అనిల్ నెల్లూరుకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వల్లభనేని వంశీ సైతం అరెస్టుకు భయపడే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గతంలో టీడీపీలో కొనసాగిన వంశీ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్‌కు దగ్గరయ్యారు. అటు కొడాలి నానిది ఇదే పరిస్థితి.. కూటమి సర్కార్ తమను అరెస్టు చేస్తారన్న భయంతో.. సైలెంట్ అయ్యారు. వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయాక. ఒకటిరెండు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అయితే చెవిరెడ్డి కామెంట్స్ తర్వాత.. ఈ ముగ్గురు నేతలు కూడా రూట్ మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకసారి జైలుకు పోయోస్తే పోలా అని ఆలోచిస్తున్నారట. గతంలో జగన్ జైలుకు వెళ్లాకే ముఖ్యమంత్రి అయ్యారని.. ఇప్పుడు తమకు అదృష్టం పట్టిన పట్టొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట..
మొత్తంగా వైసీపీ లీడర్లు రూట్ మార్చడంతో.. ఇప్పుడు ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వారిని అరెస్టు చేసి హీరోలను చేయడం ఎందుకు అనే చర్చ సైతం ప్రభుత్వంలో జరుగుతోందట. చూడాలి మరి కూటమి సర్కార్ వైసీపీ నేతలను అరెస్టు చేసి కటాకటాల వెనక్కి పంపుతుందా.. ! లేదంటే అరెస్టుల పేరుతో భయపెడుతూ కాలయాపన చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచి చూడాలి..!
Also Read: RK ROJA: చంద్రబాబు దెబ్బకు రోజా ఖతం!
Also Read: TELANGANA BJP: కామారెడ్డి జిల్లాలో కమలం కష్టాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.