Kondapalli Srinivas: ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలర్స్.. బొత్స కాళ్లు పట్టుకున్న మంత్రి అంటూ వార్తలు

Fake News Circulating On Kondapalli Srinivas: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా.. ఉత్తరాంధ్రలో ఒక వార్త కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారనే వార్త సంచలనంగా మారింది. అయితే ఇందులో వాస్తవం తెలుసుకుందాం.
Kondapalli Srinivas: గతమెంతో ఘనం అని వైఎస్సార్‌సీపీని చూసి చెప్పవచ్చు. 2014లో ఉత్తరాంధ్రను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ తాజా ఎన్నికల్లో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరాంధ్రను శాసించే స్థాయిలో ఉన్న బొత్స సత్యనారాయణ ప్రభ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం అతడిని పట్టించుకునే వారే లేరు. అలాంటి బొత్స సత్యనారాయణ విషయమై ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుత యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో బొత్స పాదాభివందనం చేయించుకున్నాడనే వార్త ఉత్తరాంధ్రలో కలకలం రేపుతోంది. ఈ వార్త విజయనగరంలో సంచలనంగా మారింది. ఈ వార్తలో వాస్తవాలు ఇలా ఉన్నాయి.
Also Read: JC Prabhakar Reddy: ఎవరికీ భయపడను.. ఇంట్లో ఉండే పెరుగన్నం తిని బతుకుతా
అధికారం లేకపోయినా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో తన హవా కొనసాగిస్తున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి అయిన కూడా కొండపల్లి శ్రీనివాస్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రినే నియంత్రించే స్థాయిలో బొత్స ఆధిపత్యం జిల్లాలో కొనసాగుతోందని ఈ వార్తతో వదంతులు సృష్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తతో తెలుగుదేశం పార్టీతోపాటు కూటమి నాయకుల్లో కలవరం మొదలైంది. వాస్తవమేమిటని మంత్రి దగ్గరి మనుషులను అడగ్గా అసలు విషయం తెలిసింది. అదంతా తప్పుడు ప్రచారం.. ఆ వార్త అసత్యమని స్పష్టమైంది.
Also Read: YS Jagan: 'ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి' మాజీ సీఎం జగన్ భరోసా
గజపతినగరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్‌ను గుర్తించిన సీఎం చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈ, ఎన్నారై సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌పై ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తేలింది. బొత్స కాళ్లు పట్టుకున్నారనే వార్త అసత్యమని మంత్రి శ్రీనివాస్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని టీడీపీ, కూటమి నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒక మంత్రిపై ఇలాంటి నీచపు రాతలు రాయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కొందరు వైసీపీ నాయకులు కుట్రతో చేస్తున్నారని టీడీపీ వర్గాలు నిర్ధారించాయి. మంత్రి శ్రీనివాస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటివి చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. యువ మంత్రిగా ఉత్తరాంధ్రను అభివృద్ధి వైపు నడిపిస్తూ పేరు పొందుతుంటే గిట్టని వాళ్లు ఇలా చేయించుఉకని పరమానందం పొందుతున్నారని మంత్రి అనుచరులు చెబుతున్నారు. తప్పుడు ప్రచారానికి తెరలేపిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి చేస్తే ఊచలు లెక్కపెట్టవలసి ఉంటుందని వైసీపీ వర్గానికి సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.