అన్నదాతలకు కష్టకాలం; విత్తనాలు మహాప్రభో అంటూ రోడ్డెక్కిన రైతులు !!
ఖరీఫ్ సీజన్లో పంటవేసేందుకు సకాలంలో విత్తనాలు దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు
అనంతపురం: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి నెల రోజులు పూర్తియినా పంటవేసేందకు సరిపడ విత్తనాలు లేక ఏపీ రైతులు అల్లాడుతున్నారు. విత్తనాల పంపణీ వ్యవహారంపై ప్రభుత్వ వైఖరికి నిరసగా అన్నదాతలు రోడ్డెకి తమ కూర్చున్నారు. ముఖ్యంగా అనంతపురం, నెల్లూరులో రైతులు ఆందోళన బాట పట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంత రైతులు ధర్నా..
అనంతపురం జిల్లా రొద్దం మండలంలో విత్తనాల పంపిణీ విషయంలో వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పెనుకొండ-పావగడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. తమకు సకాలంలో వేరుశనగ విత్తనాలను అందివ్వకపోవడంపై వ్యవసాయశాఖ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు రైతుల పోరుబాట
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయానికి వచ్చిన రైతులకు చేధు అనుభవం ఎదురైంది. విత్తనాల పంపిణీ సందర్భంగా తోపులాట జరగడంతో అధికారులు విత్తనాలు ఇవ్వడం ఆపేశారు. దీంతో రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయం ఎదుటే ఆందోళన చేపడుతున్నారు. వానలు కురిసిన నేపథ్యంలో ఇప్పటికే పంటవేసుకోవాల్సి న తరుణంతో ప్రభుత్వం నుంచి ఇంకా విత్తనాలు అందకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
ఉద్యమిస్తామంటున్న ప్రతిపక్షాలు
ఇదిలా ఉండగా విత్తనాల సమస్యపై పోరుబాట పట్టేందుకు వివిధ జిల్లాల రైతులు సిద్ధమౌతున్నారు. మరోవైపు అన్నదాతల పక్షాన పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ అంశంపై నారా లోకేష్ స్పందిస్తూ రైతులకు సకాలంలో విస్తనాల పంపిణీ జరగకుంటే ఉద్యమించేందుకు సిద్ధమని ప్రకటించారు.