Flights Cancel: ఫెంజల్ తుఫాను ప్రభావం.. హైదరాబాద్-తిరుపతి విమానాలు రద్దు
Flights Cancelled Due To Fengal Cyclone Effect: ఫెంగల్ తుఫాను ప్రభావంతో విమానాలు రద్దయ్యాయి. దీంతో విమాన కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు.
Flights Cancel: పెంగల్ తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాలు ఆగిపోయాయి. ఏపీలో పరిస్థితి భయాందోళనగా ఉండడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమాన సేవలు నిలిచిపోయాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు వరద ముప్పు.. ఫెంగల్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
తీరాన్ని తాకిన తుఫాన్
ఏపీలో భయోత్పతానికి గురి చేసిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు కూడా వీచాయి. భారీ వర్షాలు.. వరదలు ముప్పు పొంచి ఉందని భయాందోళన చెందిన ఏపీకి ఊరట లభించింది. తీరం దాటడంతో ఒకింత ప్రమాదం తప్పినట్టుగా భావిస్తున్నారు. అయితే తుఫాను తీరం దాటిన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Also Read: Tirumala: రాజకీయ నాయకులకు బిగ్‌షాక్.. తిరుమలలో వాటిపై నిషేధం
తమిళనాడుతో తెగిన సంబంధాలు
ఫెంగల్ తుఫాను ప్రభావం ధాటికి రెండు రాష్ట్రాల మధ్య బంధాలు తెగిపోయాయి. తమిళనాడులో భారీ వర్షాలు పడుతుండడంతో ఏపీ నుంచి చెన్నైకి రాకపోకలు నిలిచిపోయానాయి. తుఫాను ప్రభావంతో చెన్నైలోని రెడ్డిల్స్, వేలచ్చేరి, ఆరుంబాకం, మెరీనా బీచ్, షోలింగనల్లూరు ఐటీ కారిడర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి రోడ్లు జలమయమయ్యాయి. రెడ్ హిల్స్ వద్ద రహదారిపైకి భారీ వరద నీరు చేరడంతో ఏపీ-చెన్నై మధ్య రాకపోకలు నిలిచాయి.
రైల్వే సేవలకు ఆటంకం
ఇక రైల్వే సేవలకు కూడా ఆటంకం ఏర్పడింది. చాలా చోట్ల రైల్వే ట్రాక్ల పైకి నీరు చేరడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక వాతావరణం అనుకూలించకపోవడంతో వివిధ ప్రాంతాలకు చెన్నై నుంచి విమానాలు రాకపోకలు రద్దయ్యాయి. కాగా ఇప్పటికే తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేపట్టి ముందస్తు జాగ్రత్త చర్యలకు ఆదేశించారు. అధికారులను నిరంతరం అప్రమత్తం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter