Tirupathi Fire: తిరుపతిలో దారుణం జరిగింది. రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్తీక చిన్న పిల్లల హాస్పిటల్ లో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాల పాలై ముగ్గురు చనిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీక హాస్పిటల్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటల్లో చిక్కుకుని డాక్టర్ రవిశంకర్ రెడ్డి సజీవ దహనం అయ్యారు. మంటల్లో తిరుపతిలో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న వైద్యుడి భార్య, అత్త, ఇద్దరు పిల్లలను స్థానికులు బయటికి తీసుకువచ్చారు. తీవ్ర గాయాలైన ఇద్దరు పిల్లలు కార్తీక, భరత్ చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానికుల సమచారంతో ఘటనాస్థలానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు.


[[{"fid":"246193","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Also Read: MS Dhoni: రేపు సోషల్‌ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?


Also Read:  Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook