విజయవాడ కోవిడ్ సెంటర్ ( vijayawada covid centre ) అగ్ని ప్రమాద ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరిగింది. విశాఖపట్నంలోని ఓ క్వారెంటైన్ కేంద్రంల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం కలగలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం ( Visakhapatnam ) నగర పరిధిలోని మధురవాడ ( Madhurawada ) సమీపంలో..కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో ( quarantine centre ) హఠాత్తుగా అగ్నిప్రమాదం తలెత్తింది. షార్ట్ సర్క్యూట్ ( Short circuit ) కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని యాజమాన్యం భావిస్తోంది. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు స్థానికులు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. రోగుల్ని మరో బ్లాక్ కు తరలించారు. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్దమయ్యాయి. 


ఇటీవల విజయవాడ ( Vijayawada ) లోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ ( Swarna palace ) లో ఏర్పాటు చేసుకున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కేసు నమోదైంది. ప్రస్తుతం డాక్టర్ రమేష్ ( Dr Ramesh ) పరారీలో ఉన్నారు.