fire engine overturned: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) చిత్తురు జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ( Tirupati International Airport ) లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రన్‌ వేను పరిశీలించేందుకు వెళ్లిన ఫైరింజన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన  ఇండిగో విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అయితే మరికొన్ని విమానాలు కూడా ల్యాండింగ్ కాకుండా తిరుగుపయనమయ్యాయని సమాచారం. Also read: AP: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆతర్వాత అధికారులు రన్‌వేపై బోల్తా పడిన ఫైర్ ఇంజన్ వాహనం తొలగింపు పనులను ప్రారంభించారు. ఇదిలాఉంటే..  ఫైర్‌ ఇంజన్‌ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక ఇంకేమైన కారణంగా ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారిస్తున్నారు. Also read: AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?


ఈ సంఘటనపై విమానాశ్రయ డైరెక్టర్ ఎస్. సురేష్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన రెండున్నర గంటల్లో రన్ వే క్లియర్ చేసినట్లు తెలిపారు. విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Also read: AP Capital: ఇక కొత్త రాజధానులు త్వరలో ప్రారంభం