Monkeypox: తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోకి మంకీ పాక్స్ ప్రవేశించింది. విజయవాడలో మంకీ పాక్స్ తొలి కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం అందుతోంది. ఈమేరకు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దుబాయి నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు వచ్చినట్లు తెలుస్తోంది. మంకీ పాక్స్ కేసుగా వైద్యులు సైతం అనుమానిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే అప్రమత్తమైన చిన్నారి కుటుంబసభ్యులు విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. కుటుంబం మొత్తానికి టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది. వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. చిన్నారిని నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపారు. త్వరలో టెస్ట్‌కు సంబంధించిన రిజల్ట్ రానుంది. ఈ విషయాన్ని వైద్యాధికారులు అధికారికంగా వెల్లడించలేదు.


మరోవైపు భారత్‌లోనూ మంకీ పాక్స్‌ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్‌, యూపీ రాష్ట్రాల్లో అక్కడక్కడ కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజాగా ఏపీకి రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మంకీ పాక్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులకు సీఎం జగన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. కరోనా పట్ల ఎలాంటి వ్యూహాలతో వెళ్లామో అదే రీతిలో మంకీ పాక్స్‌ను ఎదురుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం అందుతోంది.


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం..రాగల మూడురోజులపాటు వర్ష సూచన..!


Also read:PV Sindhu: దూసుకెళ్తున్న తెలుగు తేజం..తాజాగా సింగపూర్ ఓపెన్‌ విజేతగా పీవీ సింధు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.