YS Jagan Mohan Reddy: ఘోర ప్రమాదం సంభవించి నష్టపోయిన బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఇంకా నష్ట పరిహారం చెల్లించకపోవడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు నష్ట పరిహారం రాకుంటే నాకు చెప్పండి. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా' అని ప్రకటించారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని తెలిపారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి


అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో 17 మంది మృతి చెందగా.. 45 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అనకాపల్లిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు. సంఘటన వివరాలు తెలుసుకున్నారు. వైద్యులను అడిగి వైద్య సేవలు ఆరా తీశారు. అనంతరం మీడియాతో జగన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

Also Read: Atchutapuram SEZ: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?


 


'అచ్యుతాపురంలో జరిగిన ఘటన చాలా బాధాకరం.  ప్రమాదంలో గాయపడిన వారిని కంపెనీ బస్సుల్లో తరలించారు. కనీసం ప్రభుత్వం అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేయలేదు. బాధితులకు న్యాయం జరగకపోతే, వారి తరఫున పోరాటానికి వెనకాడేది లేదు. ఎల్జి పాలిమర్స్ ఘటన అర్ధరాత్రి  జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 24 గంటల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహాం ఇచ్చాం. ఇప్పుడు ఘటన జరిగినప్పుడు మంత్రులు కూడా స్పందించని పరిస్థితి' అని అసహనం వ్యక్తం చేశారు.


'పరిశ్రమల సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలి. దీనికోసం గత ప్రభుత్వ హయాంలో అనేక జీవోలు అమలు చేశాం. ఈ ప్రభుత్వం రెడ్ బుక్‌లో పేర్లు రాయడం, కక్షపూరితంగా వ్యవహరించడం మినహా అభివృద్ధి లేదు. జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి కింద ప్రభుత్వం రూ.20,000 సహాయం అందించలేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదు. నాడు నేడు పథకంలో పాఠశాలలు బాగుపడ్డాయి. ఇప్పుడు అమ్మ ఒడి పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము అందక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు' అని జగన్‌ తెలిపారు.


'నష్ట పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూపాయి ముట్టలేదు. పరిహారం వెంటనే చెల్లించాలి. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వయంగా ధర్నా చేస్తా. బాధితులకు అండగా ఉంటా' అని జగన్‌ ప్రకటించారు.


'ఈ ఘటనను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఇంటి వద్దకు వచ్చే పింఛన్‌, ఉచిత రేషన్‌ ఆగిపోయింది. పాఠశాలలు, ఆస్పత్రులు, పరిశ్రమలు ఇలా అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. కొట్టడం.. చంపడం.. ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తోంది' అని చంద్రబాబు పాలనపై జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook