Kodali Nani: చిరంజీవిని నేను విమర్శించలేదు.. అసలు కారణం చెప్పిన కొడాలి నాని
Kodali Nani On Chiranjeevi: చిరంజీవిని తాను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Kodali Nani On Chiranjeevi: సినీ నటుడు చిరంజీవిని తాను విమర్శించలేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. తన మాటలను జనసేన, టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడుతామంటూ హెచ్చరించారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తాను ఏం మాట్లాడానో చిరంజీవికి.. ఆయన అభిమానులకు తెలుసని చెప్పారు. నేడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా గుడివాడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు.
ఎవరీ జోలికి వెళ్లని చిరంజీవిని తాను విమర్శించలేదని కొడాలి నాని అన్నారు. అంత సంస్కారహీనుడిని తాను కాదని.. ఆయన విమర్శిస్తే రాజకీయంగా ఏమవుతుందో తెలుసని అన్నారు. పెద్దాయనగా ఆయన చెప్పే మాటలను తాము వింటామన్నారు. మూవీ ఇండస్ట్రీలో కొందరు పకోడి వ్యక్తులు ఉన్నారని.. నటన తెలియని వాళ్లు.. డ్యాన్స్ రాని వాళ్లు ఉన్నారని ఆ వెధవలే తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవిని తాను పకోడి అన్నట్లు కొంతమంది టీడీపీ, జనసేన వెధవలు వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు.
తాము శ్రీరామ అన్నా కూడా.. టీడీపీ, జనసేన నేతలకు నీ అమ్మ అన్నట్లుగా వాళ్లకు వినబడుతుందన్నారు. వాళ్లకు ఎలా వినిపించినా కూడా తనను ఏం చేయలేరని స్పష్టం చేశారు. వాళ్లు ఎన్ని ధర్నాలు చేసుకున్నా.. రోడ్డు మీద పందుల్లా పోర్లాడినా.. తాను ఎవరికీ సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. తనకు చిరంజీవికి.. చిరంజీవికి మధ్య ఎలాంటి అఘాదం సృష్టించలేరని అన్నారు. తాను ఏమన్నానో ఆయనకు తెలుసు.. తనకు చిరంజీవితో సన్నిహిత సంబంధం ఉందని చెప్పారు. చిరంజీవిని ఎప్పుడూ కూడా తాను గౌరవిస్తానని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఊరేగింపుగా తమ ఆఫీస్ ముందు వెళ్తుంటే.. తాను బయటకు వచ్చి నమస్కారం చేశానని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిని అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడానని చెప్పారు.
Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి