Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?
Ambati Rayudu Political Entry: క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. పొలికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అంబటికి వైసీపీ నుంచి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
Ambati Rayudu Political Entry: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ తరువాత పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డితో వరుస భేటీలు.. వైసీపీ ప్రభుత్వ పరిపాలనను ప్రశంసిస్తూ.. ట్వీట్లు, కామెంట్లు చేస్తూ హింట్ ఇస్తున్నాడు. లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నాడు. క్రికెట్ పిచ్‌పై బ్యాటింగ్‌తో దుమ్ములేపిన అంబటి.. పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు.
రాయుడు గుంటూరు నుంచి వచ్చి గత వారం రెండు సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో రాయుడిని పోటీకి దింపాలని జగన్ భావిస్తున్నప్పటికీ.. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయాల్లోకి వస్తున్న యువతకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద స్ఫూర్తి అని.. ఒక ప్రాంతంపై దృష్టి పెట్టకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధిలో దూసుకుపోతున్నారని అంబటి రాయుడు అన్నాడు. జగన్ నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెప్పాడు.
రాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పొన్నూరు లేదా గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని పార్టీలోని సీనియర్ రాజకీయ నాయకులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం ఆయనకు బెస్ట్ ఆప్షన్ అని వైసీపీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ వి.బాలసౌరి, పొన్నూరు నుంచి ఎమ్మెల్యే కేవీ రోశయ్య ఉన్నారు. గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచినప్పటికీ.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలోకి మారారు. బాలసౌరి స్థానంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతేకాదు 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బాలసౌరి యోచిస్తున్నట్లు సమాచారం. పొన్నూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు రాయుడుకు లైన్ క్లియర్ అవుతుంది.
Also Read: Adipurush Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. ఆధునిక రామాయణం ఎలా ఉందంటే..?
Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి